ఛాయ్ పే చర్చ వారితో ఎందుకసలు?

November 27, 2015 | 12:07 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi-invites-Sonia-Rahul-for-chai-niharonline

కౌంటర్లు, విమర్శలతో ఎప్పుడూ బిజీగా ఉండే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి, ఆమె తనయుడు రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ తేనీటి విందుకు ఆహ్వానించాడు. మోదీ అంటేనే పడని వారికి మోదీ ఛాయ్ పే చర్చ దేనికనేగా మీ అనుమానం. దీని వెనుక పెద్ద ఫ్లానే ఉందని సమాచారం.

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన జీఎస్టీ బిల్లుకు ఆమోదమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలను కలుపుకు పోవాలని భావిస్తున్నారు. జీఎస్టీకి ఉన్న అడ్డంకులను చర్చల ద్వారానే తప్పించాలని భావిస్తున్న ఆయన, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను తేనీటి విందుకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. రేస్ కోర్స్ రోడ్డులోని తన నివాసానికి నేటి సాయంత్రం 7 గంటలకు రావాలని, స్వాగతం పలికేందుకు తాను సిద్ధంగా ఉంటానని చెబుతూ, కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం పంపారు. కాగా, జీఎస్టీపై ఎవరితోనైనా చర్చించేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ