త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని ఇప్పటి నుంచే మొదలుపెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం అసోం పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ పై, మాజీ ప్రధాని మన్మోహన్ పై విరుచుకుపడ్డారు. అసోంలోని కోక్రాఝార్ లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
పదిహేను సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులను.. పదిహేను నెలల్లో తాము చేయాలని సోనియాగాంధీ అనడం చాలా విడ్డూరంగా ఉందని మోదీ వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను, అసోంలో కాంగ్రెస్ పాలనను మోదీ తూర్పారబట్టారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఉండటం కారణంగా ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉండవని తాను అనుకున్నానని.. కానీ, అటువంటి పరిస్థితులు ఇక్కడ లేవని అన్నారు. కాగా, అసోం అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయి.