మహనీయులను మరవొద్దు... గౌరవిద్దాం

January 30, 2016 | 11:29 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Modi_calls_nation_for_clean_statues_niharonline

ఓ గొప్ప వ్యక్తిని స్మరించుకునేందుకు పలు చోట్ల విగ్రహాలను ఏర్పాటు చేయటం మన దేశంలో కామనే. స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయనాయకులు, ప్రముఖులు, సినీ ప్రముఖులు, మత పెద్దలు ఇలా ఎవరైనా సరే... వారి వారి జయంతి, వర్ధంతి రోజున ఆ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించటం మనం చూస్తుంటాం. అయితే మిగతా రోజుల్లో వాటి పరిస్థితి ఏంటీ? తర్వాత వాటి వైపు చూసేవారు కూడా ఉండరు. అవి దెబ్బతిన్నప్పటికీ, దుమ్ము దూళితో నిండిపోయినప్పటికీ అటుగా వెళ్తున్న వారెవ్వరూ దానిని పట్టించుకోరు. ఆ మహనీయుల విగ్రహాలను ప్రజలు ఎల్లప్పుడూ గౌరవించాలనేదే మోదీ ఆలోచన. అందులో భాగంగానే దేశ ప్రజలకు మరో కొత్త కార్యక్రమంతో పిలుపునిచ్చారు. ఇప్పటికే స్వచ్ఛ్ భారత్ తో క్లీన్ ఇండియాకు పిలుపునిచ్చిన మోదీ అందులో కొంత మేర పురోగతి సాధించారనే చెప్పొచ్చు.

                    ఇక ఇప్పుడు స్వచ్ఛ భారత్ లో భాగంగా స్టాచ్యూ క్లీనింగ్ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఇందుకోసం సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్లో ఓ హ్యాష్ ట్యాగ్ ను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తమ దగ్గర్లోని జాతి గర్వించదగ్గ మహనీయుల విగ్రహాలను శుభ్రం చేసి, ఆ ఫోటోను #statuecleaning ద్వారా ట్వీట్ చేయాలని కోరారు. రానున్న రోజుల్లో అందులో కొన్నింటిని తన ట్విట్టర్ ద్వారా రీట్వీట్ చేస్తానని మోదీ తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ