మోదీకి కజకిస్థాన్ లో అపూర్వ కానుక

July 08, 2015 | 03:34 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi_gifted_by_religious_books_in_kajakisthan_president_niharonline

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి అద్భుతమైన కానుక దొరికింది. కజకిస్థాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్బయేవ్ తో బుధవారం మోదీ భేటీ కాగా, ఈ సందర్భంగా ఆయన మోదీకి భారత్ లోని మతాలకు సంబంధించిన గ్రంథాలను బహుకరించారట. వాల్మీకి రామాయణంతోపాటు, ఇంగ్లీష్ లోకి అనువదించిన గురు గ్రంథ్ సాహెబ్, జైన, బుద్ధ మత విశ్వాసాలకు సంబంధించిన పుస్తకాలను అందజేశారట. 2003 నుంచి నూర్ సుల్తాన్ ప్రతి మూడేళ్లకోకసారి ప్రపంచ సాంప్రదాయ మతాల సమావేశాన్ని నిర్వహిస్తారు. దీంతో మోదీకి ప్రత్యేకంగా పుస్తకాలను కానుకగా అందించారట. ఆరు దేశాల పర్యటనల్లో భాగం ఆయన ప్రస్తుతం కజకిస్థాన్ లో ఉన్నారు. కాసేపట్లో బయలుదేరి రష్యా వెళ్తారు. అక్కడ బ్రిక్స్, సదస్సుతోపాటు ఎస్ సీఓ లో కూడా పాల్గొంటారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ