నిరుద్యోగులకు ‘అచ్చెదిన్’ రాబోతున్నాయా?

April 18, 2016 | 12:43 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi_2lakhs_central_jobs_niharonline

ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి  శుభవార్త.  వచ్చే రెండేళ్లలో దాదాపు 2.2 లక్షల కేంద్ర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని నరేంద్ర మోదీ సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, తాను ఇచ్చిన ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్న మోదీ, ఈ మేరకు నియామకాలకు పచ్చజెండా ఊపినట్టు ఓ ప్రముఖ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

                          మార్చి 1, 2015 నాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య 33.05 లక్షలు కాగా, 2016లో ఈ సంఖ్యను 34.93 లక్షలకు, ఆపై 2017 నాటికి 35.23 లక్షలకు చేర్చనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా 70 వేల ఉద్యోగాలు రెవెన్యూ శాఖకు అనుబంధంగా ఉన్న ఆదాయపు పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్ విభాగాల్లో ఉంటాయని తెలుస్తోంది. కొత్త ఉద్యోగాల భర్తీ జరిగితే నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చినట్లే!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ