కందిపోయినా బంధం బలపడుతుంది

April 16, 2016 | 05:37 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi-shake-hand-william-niharonline

భారత్‌కు వచ్చిన బ్రిటన్ ప్రిన్స్‌కు మోదీ విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యువరాజు విలియమ్‌కు మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. తన స్టయిల్లో మోదీ పలకరించారు. ఆ బంధం ఎంత బలంగా ఉందంటే.. మోదీ ఇచ్చిన హ్యాండ్ షేక్‌కు యువరాజు చేతి కందిపోయింది. మోదీ చేతి వేలి ముద్రలు ప్రిన్స్ చేతి మీద అచ్చు పడ్డాయి. ఇంటర్నెట్‌లో ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి. దేశాధినేతలు అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం సహజం. అయితే ప్రధాని మోదీ ఇచ్చిన ఆతిథ్యం మాత్రం ప్రిన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది. ఆన్‌లైన్‌లో ఆ వీడియోను చూసినవాళ్లంతా తెగ్ ఎంజాయ్ చేస్తున్నారు.

                       మోదీ దౌత్యం ఇంత వెరైటీగా ఉండడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ మోదీ తనదైన స్టయిల్లో అతిథులను పలకరించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతోనూ మోదీ టైటానిక్ హగ్ చేశారు. వెనుక నుంచి హోలాండేను మోదీ ఆలింగనం చేసుకోవడం అప్పుడు కూడా ఆన్‌లైన్ వీక్షకులను ఆకట్టుకుంది. సాధారణంగా ప్రపంచ దేశాధినేతలకు హ్యాండ్‌షేక్‌లు, హగ్‌లు కామన్. అది వాళ్లకో బిజినెస్‌గా మారుతుంది. కొందరు ఆత్మీయంగా పలకరిస్తుంటారు. మరికొందరు ముభావంగా తమ బంధాన్ని వ్యక్తం చేస్తుంటారు.  ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా ఆత్మీయ దౌత్యం ఉంటే అదే విశ్వ శాంతికి మార్గం చూపిస్తుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ