అంబేద్కర్ గురించి కొత్త విషయం

April 14, 2016 | 04:10 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi-tribute-ambedkar-125-birth-anniversary-niharonline

భారత రాజ్యాంగాన్ని రచించిన డా. బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వమానవుడని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నాడు. ఆయన 125వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ట్విట్టర్‌ ద్వారా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. పేద, అట్టడుగు వర్గాల ప్రజలకు సేవ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ సందర్భంగా మోదీ ఓ ఫొటోను పోస్టు చేశారు.

మారిటైమ్ ఇండియా సమ్మిట్‌ సందర్భంగా మోదీ ఈ సందర్భంగా అంబేద్కర్ గురించి ఓ కొత్త విషయం తెలిపారు. వాటర్ అండ్ రివర్ నేవిగేషన్ కు ఆద్యుడు అంబేద్కరేనని మోదీ తెలిపారు. ఆయన ఆశయాలకు, విజన్‌కు కట్టుబడి మా ప్రభుత్వం జాతీయ జల రవాణాను ముందుకు తీసుకుపోనుందని తెలిపాడు. ఇక అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని ‘గ్రామ్‌ ఉదయ్‌ సే భారత్‌ ఉదయ్‌’ అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని మో ప్రాంతం నుంచి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ