పీఎఫ్ ఖాతాదారులకు మోదీ బంపరాఫర్

May 10, 2016 | 12:06 PM | 7 Views
ప్రింట్ కామెంట్
Modi-Provident-Fund-house-scheme-niharonline

ఐదు కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు మోదీ సర్కార్ శుభవార్త అందిస్తోంది. సొంతిల్లు లేని చిరుద్యోగులకు లోకాస్ట్ హౌసింగ్ స్కీము కింద ఇంటి సౌకర్యం దగ్గర చేసే ఆలోచనలో కొత్త స్కీముకు రూపకల్పన చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. "ఎంప్లాయి పెన్షన్ ఫండ్ లో భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులకు వారి స్థాయిని బట్టి ఇళ్లు కట్టించే యోచనలో ఉన్నాం. ఈ స్కీమ్ ప్రస్తుతం ప్రాథమిక చర్చల స్థాయిలో ఉంది" అని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం కట్టించే ఇళ్లకు పీఫ్ వినియోగదారులు తమ ఖాతాల మొత్తాన్ని తనఖా పెట్టేలా ఏదైనా స్కీమును ప్రవేశపెడుతున్నారా? అని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు దత్తాత్రేయ సమాధానం ఇచ్చారు.

కాగా, పీఎఫ్ నిధి నుంచే నెలసరి గృహ ఈఎంఐని మినహాయించుకునేలా ఓ స్కీముకు రూపకల్పన చేయాలని గత సంవత్సరం సమావేశమైన ఈపీఎఫ్ఓ ట్రస్టీల సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఇది పీఎఫ్ వినియోగదారులకు ఈ స్కీమును, తమ ఉద్యోగ కాలంలో ఇల్లు కట్టుకోలేని పక్షంలోనే వర్తింపజేయాలని ఈపీఎఫ్ఓ ట్రస్టీలు సిఫార్సు చేశారు. ఇప్పుడా స్కీముకు కొన్ని మార్పులు చేయాలన్నది మోదీ సర్కారు అభిమతంగా తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ