ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం ఆయన రష్యా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడ మోదీ పర్యటిస్తారు. . 2000 సంవత్సరం నుంచి రష్యా, భారత్ లు ఓ ఏడాది మాస్కోలో, మరో ఏడాది న్యూఢిల్లీలో ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ దఫా మోదీ రష్యా వెళ్లనున్నారు. అణుశక్తి, హైడ్రోకార్బన్, రక్షణ, వ్యాపార రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య సంబంధాలు విస్తరింపజేసుకునే అంశాలపై చర్చలు జరుపుతారు. పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అవుతారు. అనంతరం పలు ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేస్తారు.