గిన్నిస్ రికార్డు యువతికి మోదీ అభినందనలు

April 12, 2016 | 04:32 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Sony-Chaurasia-modi-niharonline.jpg

ప్రధానిగా బిజీ షెడ్యూల్ తో ఉన్నప్పటికీ యువతలో నైపుణ్యం గమనించి వారిని ఎంకరేజ్ చేయటంలో ప్రధాని మోదీ ఎప్పుడూ ముందుంటారు. ఇదే క్రమంలో తన నియోజకవర్గంలోని ఓ అమ్మాయిని ప్రొత్సహించారాయన. పాన్ అమ్ముకునే ఇంట్లో పుట్టిన అమ్మాయి చరిత్ర సృష్టించింది. శాస్త్రీ య నృత్యం మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి పెంచుకున్న ఆమె నృత్యంతో అరుదైన ఫీట్ సాధించింది.

                                                  వారణాసికి చెందిన సోనీ చౌరాసియా ఒకటి కాదు, రెండు కాదు 123 గంటల 30 నిమిషాలు కథక్ నృత్యం చేసింది. రాజేష్ డోగ్రా ఆధ్వర్యంలో  మౌంట్ లిటెరా జీ స్కూల్ ఈ రికార్డుకు వేదికైంది. ఏప్రిల్ 4న సాయంత్రం ఆరు గంటలకు సోనీ నృత్య ప్రదర్శన మొదలైంది. ఆరు రోజుల పాటు కొనసాగిన ఈ ప్రదర్శన ఏప్రిల్ 9న రాత్రి తొమ్మిదిన్నరకు ముగిసింది. ప్రతీ నాలుగు గంటలకు ఒకసారి 20 నిమిషాల బ్రేక్ తీసుకుంటూ ఈ ఫీట్ సాధించింది సోనీ. గతంలో 123 గంటల 20 నిమిషాలు మోహినీయట్టం నృత్యం చేసిన కేరళకు చెందిన హేమలతా కుందల్ రికార్డును సోనీ బ్రేక్ చేసింది. సోనీ ప్రదర్శనకు ప్రధానమంత్రి మోదీని కూడా ఆహ్వానించింది. ఆయన రాలేకపోయారు. కానీ సోనీ రికార్డు సృష్టించిందని తెలిసి మోదీ ట్విట్టర్‌లో సోనీకి శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ