విదేశీ వలస పాలనో 450 సంవత్సరాలు మగ్గిన గోవా ప్రాంత విముక్తి కోసం స్వాతంత్ర్య సమరయోధులు చేసిన కృషి ఎనలేనిదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గోవా లిబరేషన్ డే సందర్భంగా శనివారం మోదీ తన ట్విట్టర్ అకౌంట్లో పలు విషయాలను పంచుకున్నారు. గోవా విముక్తి జరిగి నేటితో (డిసెంబర్ 19)తో సరిగ్గా 54 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా గోవా ప్రజలకు శుభాకాంక్షలు. పరాయిపాలన చెర నుంచి గోవాను విడిపించేందుకు ఉద్యమం జరిపిన వారందరినీ ఈ సందర్భంగా మనం గుర్తుతెచ్చుకుందాం. వారికి వందనాలు. అంటూ ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు.
1961 నుంచి పోర్చుగ్రీస్ పాలనలో మగ్గిన గోవాకు డిసెంబర్ 19, 1961 కేంద్రం చొరవతో స్వాతంత్ర్యం లభించింది.