యువత స్వప్నం దేశ వికాసానికే

April 19, 2016 | 03:51 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi-speech-at-Shri-Mata-Vaishno-Devi-University-niharonline

తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వదులుకుని, మీ భవిష్యత్తు కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని యువతకు మోదీ పిలుపునిచ్చారు. మంగళవారం జమ్ము కశ్మీర్‌ కత్రాలోని మాతా వైష్ణో దేవి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. కూతుళ్లను చదువు వైపు మళ్లిస్తున్న తల్లులందరికీ వందనాలు సమర్పిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 24 గంటల క్రితమే ఓ భారతీయ అమ్మాయి రియో ఒలింపిక్స్‌కు ఎంపికైందని, ఆమె సాధించిన ఘనత అపూర్వమని జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ను మోదీ కీర్తించారు.

                             ఇది విజ్ఞాన శతాబ్ధం అని, మానవజాతి విజ్ఞాన యుగంలోకి వెళ్లిన ప్రతిసారి భారత్ దానికి మార్గం చూపింది. యువత స్వప్నం దేశ వికాసానికి ఉపయోగపడుతుంది. ఎంతో మంది భక్తులు ఇచ్చిన కానుకలతో వైష్ణో దేవి విశ్వవిద్యాలయం నిర్మించారు, భక్తుల్లో చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఉన్నారు అని ఆయన తెలిపారు. సాధించలేని దాని గురించి ఆలోచించడం మానేసి, సాధించిన దాని గురించి ఆలోచించాలని మోదీ అన్నారు.. గతాన్ని మర్చిపోండి...భవిష్యత్‌కు పునాది వేయండని పిలుపునిచ్చారు.  కశ్మీర్‌ నుంచి వెళ్లిపోయిన మీ పూర్వీకులను సాదరంగా ఆహ్వానించండని మోదీ పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ