ఎన్నికల ప్రచారం దీదీ ఇలాకా నుంచేనా?

March 14, 2016 | 03:36 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi_election_campaign_begins_bengal_niharonline

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రచారం ప్రారంభించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోంతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రచారాన్ని మాత్రం పశ్చిమ బెంగాల్ నుంచే ప్రారంభించాలన్న యోచనలో ప్రధాని ఉన్నాడంట.

ఈ విషయాన్నిబీజేపీ నేత దిలీప్ ఘోష్ ధృవీకరించారు. బెంగాల్ నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేందుకు మోదీ సుముఖంగా ఉన్నారని ఘోష్ తెలిపాడు.  మూడు, నాలుగు దశల్లో జరిగే ఎన్నికల కోసం ప్రధాని తేదీల్ని కోరామని, మొత్తం పది సభల్లో ప్రసంగించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం రావాల్సివుందని చెప్పారు. జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు బీజేపీ ప్రధాన నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. కాగా, మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులతో కూడా ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ