ప్రధాని నరేంద్ర మోదీ ఈ యేడాది మొత్తం బిజీ బిజీ షెడ్యూల్ తో గడిపేశారు. సగం రోజులకి పైగా విదేశీ పర్యటనలు, సమావేశాలు, సభలు ఇలా మొత్తం మీద 2015 కు వీడ్కోలు పలుకుతున్నారు. ఇక చివరి రోజు అయిన 31న ఫుల్ బిజీ షెడ్యూల్ ను దేశ రాజధాని ఢిల్లీ లో ఫ్లాన్ చేసుకున్నారాయన. ఢిల్లీ-మీరట్ ఎక్స్‑ప్రెస్‑వేకు శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న ట్రాఫిక్‑ను నియంత్రించాలానే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.
ఉత్తరప్రదేశ్‑లోని మీరట్ నగరం.. ఢిల్లీకి ఈశాన్యదిశగా 70 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దేశ రాజధాని ప్రాంతంలో ఇదే అతి పెద్ద నగరం. మీరట్-ఢిల్లీ జాతీయ రహదారి 58 నిత్యం రద్దీగా ఉంటుంది. ఢిల్లీ పరిసరాల్లో ట్రాఫిక్‑ను నియంత్రించడం కోసం గత నెలలో మోదీ 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఢిల్లీ మహా నగరాన్ని అనుసంధానం చేసే మూడు హైవే ప్రాజెక్టులను ప్రారంభించారు కూడా.