ఆయన మాటలు అక్షరాల నిజం!

December 29, 2015 | 03:07 PM | 3 Views
ప్రింట్ కామెంట్
modi-ambedkar-industrialisation-niharonline

దళితులకు ఎక్కువ ప్రయోజనం పారిశ్రామికీకరణతోనే కలుగుతుందన్న అంబేద్కర్ వ్యాఖ్యలే కరెక్ట్ అని ప్రధాని మోదీ అన్నారు. నిరు పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తల జాతీయ సదస్సుకు మోదీ హాజరై, ప్రసంగించారు. ఉద్యోగాలను కోరుకునేవారికన్నా, ఉద్యోగాలను సృష్టించేవారిని తయారు చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. అలాంటి వారి వల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా 80 లక్షల మంది ఎలాంటి పూచీకత్తులు లేకుండానే రుణాలు పొందారని... వీరిలో ఎక్కువ మంది గిరిజనులు, దళితులు, ఓబీసీలే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు యువ పారిశ్రామికవేత్తలకు మోదీ ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ