విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు కలవనున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్న మోదీ ఆదివారం జర్మనీ చేరుకుంటారు. దీంతో వారు ప్రధానిని కలవాలని నిర్ణయించుకున్నారట. అంతేకాదు బోస్ కుటుంబ సభ్యులపై నాడు ప్రధానమంత్రిగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం 20 ఏళ్ల పాటు నిఘా ఉంచినట్టు తాజాగా ఐబీ ఫైళ్ల ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో వారు మోదీతో ఈ విషయమై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు బెర్లిన్ లో భారతీయ ప్రవాసుల కార్యక్రమంలో బోస్ మేనల్లుడు సూర్య కూడా ప్రధానిని కలిసే అవకాశం ఉందని సమాచారం.