మోదీ చిత్రం భళారే విచిత్రం

April 21, 2016 | 03:50 PM | 4 Views
ప్రింట్ కామెంట్
modi-wax-Madame-Tussaud-niharonline

ప్రఖ్యాత మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్.. తమ మ్యూజియాల్లో నెలకొల్పేందుకు ఇటీవల నరేంద్రమోదీ మైనపు విగ్రహాలను రూపొందించింది. లండన్‌లోని ప్రధాన కార్యాలయంలో నెలకొల్పనున్న విగ్రహాన్ని సోమవారం ప్రధాని మోదీ వద్దకు మ్యూజియం ప్రతినిధులు తీసుకువచ్చారు. దాన్ని చూసిన మోదీ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. తన ప్రతిరూపాన్ని ప్రత్యక్షంగా తిలకించారు. నమస్తే పెట్టారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఫొటోలు దిగారు. నాలెక్కనే బాగున్నావే.. అంటూ మురిసిపోయారు.  సృష్టికర్త బ్రహ్మకే బ్రహ్మలు మేడమ్ టుస్సాడ్స్ కళాకారులు. వారి గురించి చెప్పడానికి మాటలు సరిపోవు అని ప్రధాని కీర్తించారు.

                                     1935లో లండన్ కేంద్రంగా ఏర్పడిన మేడమ్ టుస్సాడ్స్.. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి, వాటిని తమ మ్యూజియాల్లో ప్రదర్శనకు ఉంచుతుంది. ఈ ఏడాదికి గాను మోదీ విగ్రహాలను రూపొందించింది. సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్‌ల్లోని తమ మ్యూజియాల్లో బుధవారం మోదీ మైనపు విగ్రహాలను ఏర్పాటు చేసింది. సోమవారం ప్రత్యేకంగా ప్రధాని మోదీకి చూపించేందుకు లండన్ నుంచి ఢిల్లీకి ఆయన మైనపు విగ్రహాన్ని తీసుకువచ్చింది. లండన్‌కు మోదీ వచ్చే అవకాశం లేకపోవడంతో వారే ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ విగ్రహాన్ని లండన్‌లో ఈనెల 28 నుంచి ప్రదర్శనకు ఉంచనున్నారు. మోదీ మైనపు విగ్రహ తయారీకి రూ. 1.5కోట్లు ఖర్చయ్యాయని, నాలుగునెలల సమయం పట్టిందని మ్యూజియం ప్రతినిధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ