మహాశయుల భావాలను దెబ్బకొడుతుంది వారే!

November 02, 2015 | 12:24 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Modi_in_katihar_rally_lalu-nitish-niharonline

ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా, దేశంలో ఎక్కడా లేని విధంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని నితిశ్, లాలూ పై మోదీ మండిపడ్డారు. అసలు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కోరుతూ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ 2005లో డిమాండ్ చేశారన్నారు. అసలు ఆ సమయంలో ఒకరి ముఖం మరొకరు చూసుకోనంతగా బద్ధశత్రువులుగా ఉన్న వారిద్దరూ... మత ప్రాతిపాదికన రిజర్వేషన్లపై మాత్రం ఏకమయ్యారని విమర్శించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కతిహార్, మధుబనిల్లో నిర్వహించిన ర్యాలీల్లో మోదీ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ‘మత రిజర్వేషన్లను’ అంబేడ్కర్, నెహ్రూ, వల్లభాయ్‌పటేల్ వంటి గొప్పవారు వ్యతిరేకించినప్పటికీ..  అమలు చేయాలని నితీశ్, లాలూ వంటివారు కోరారని.. ఇప్పుడేమో తమకు మతం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రస్తుత రిజర్వేషన్ల విధానాన్ని మార్చేందుకు అధికారం లేదని అన్నారు. ఆ మహాశయులు భావాలను దెబ్బతీసే విధంగా వ్యవహారిస్తున్న వారికి ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెబుతున్నారని మోదీ తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ