అర్థం చేసుకోండి... మీ ఆక్రోశానికి నేనూ గొంతు కలిపాను

March 09, 2015 | 02:01 PM | 53 Views
ప్రింట్ కామెంట్
modi_lok_sabha_about_alam_release_niharonline

జైలు నుంచి జమ్ము కశ్మీర్ వేర్పాటువాద నేత మసరత్ ఆలమ్ విడుదలపై పార్లమెంటు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ పెదవి విప్పారు. ఆలమ్ విడుదల తర్వాత దేశవ్యాప్తంగా వెలువెత్తుతున్న నిరసనల గురించి తనకు తెలుసునని ఆయన అన్నారు. ‘‘మీ ఆక్రోశానికి నేను సైతం గొంతు కలిపాను. అవసరమైనప్పుడే రాజకీయాలు చేయాలి. అంతేగానీ ప్రతీ విషయంపైనా రాద్ధాంతం కూడదు’’ అని విపక్షాలకు ఆయన సలహా ఇచ్చారు. సభ్యుల ఆందోళనతో ఏకీభవిస్తానని, సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీకి తెలియకుండానే పీడీపీ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఇదే విషయమై పార్లమెంటులో ప్రకటన చేశారు. విపక్షాల నినాదాల నడుమే ఆయన మాట్లాడుతూ... ఈ విషయంలో కశ్మీర్ సర్కార్ నుంచి నివేదిక అందిందని తెలిపారు. ఈ నివేదికపై ఉన్న సందేహాలను నివ్రుత్తి చేయాలని ముఫ్తీ ప్రభుత్వాన్ని కోరామని, జవాబు రాగానే సభ్యులకు తెలియజేస్తామని అన్నారు. దేశ భద్రత విషయంలో తమ ప్రభుత్వం ఏ దశలోనూ రాజీపడబోదని తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ