బ్రిటన్ పార్లమెంట్ లో మోదీ మార్క్

November 13, 2015 | 11:14 AM | 1 Views
ప్రింట్ కామెంట్
pm-modi-speech-in-britain-parliament-niharonline

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటనలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. తన మార్క్ ప్రసంగంతో బ్రిటన్ పార్లమెంటును ఆకట్టుకున్నాడు. ఛలోక్తులు విసిరి బ్రిటన్ ఎంపీల మోముల్లో నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ పై సరదా వ్యాఖ్యలు కూడా చేశాడాయన. బ్రిటన్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని జేమ్స్ కామెరూన్ కు తానో నినాదాన్ని ఇచ్చానని మోదీ పేర్కొన్నారు. ‘‘ఫిర్ ఏక్ బార్... కామెరూన్ సర్కార్’ అన్న ఆ నినాదంతోనే కామెరూన్ ఆ ఎన్నికల్లో విజయం సాధించారని మోదీ చెప్పారు. తానిచ్చిన నినాదంతో విజయం సాధించిన కామెరూన్, తనకు రాయల్టీ చెల్లించాల్సి ఉందని కూడా మోదీ చలోక్తి వేశారు.

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు లేకపోవటంతో కామెరూన్ మొహంలో విశ్రాంతి, సంతోషం క్లియర్ గా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా భారత్, బ్రిటన్ మధ్య నెలకొన్న బలమైన సంబంధాలను ప్రస్తావించిన మోదీ... బ్రూక్ బాండ్ టీ, జాగ్వార్, డేవిడ్ బెక్ హాంలను ఉటంకించారు. ‘‘బ్రూక్ బాండ్ టీ, జాగ్వార్ తదితర వస్తువులు భారతీయ వస్తువులా? బ్రిటన్ వస్తువులా? అన్నది చెప్పడం కష్టం. అంతలా భారత్, బ్రిటన్ లు కలిసిపోయాయి. భారత్ లోని ప్రతి ఔత్సాహిక ఫుట్ బాల్ క్రీడాకారుడు తాను డేవిడ్ బెక్ హాంలా తయారు కావాలని కోరుకుంటాడు. ఇది ఇరు దేశాల మధ్య భావోద్వేగాలకు నిదర్శనం’’ అని మోదీ పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ