లాస్ట్ పంచ్ కు అభినందనలు

April 28, 2016 | 05:20 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi_gslv_last_rocket_niharonline

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రోకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పీఎస్‌ఎల్వీ సీ33 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయ శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. గురువారం పీఎస్‌ఎల్వీ సిరీస్ లోని చివరి రాకెట్ సీ-33 ను విజయవంతంగా ప్రయోగించారు. సరిగ్గా మధ్యాహ్నం 12.50 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ తనకు నిర్దేశించిన సమయంలో ఐఆర్‌ఎస్‌ఎస్‌ఎస్ 1జీ ఉప్రగ్రహాన్ని కక్షలోకి ప్రవేళపెట్టింది. దీంతో ప్రయోగం విజయవంతమైనట్టయింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సహాలు వెల్లి విరిశాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ