భారత్ పురోగతికి మరో ముందడుగు

July 01, 2015 | 10:50 AM | 3 Views
ప్రింట్ కామెంట్
narendra_modi_digital_india_niharonline

అభివృద్ధి పథంలో భారత్ ను అగ్రగామిగా నిలిపేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరో అడుగు ముందుకు వెయ్యనున్నారు. బుధవారం ఆయన తన కలల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. ఈ-భారత్‌లో భాగంగా ‘డిజిటల్ ఇండియా’ అనే పేరుతో ఓ కొత్త ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని రెండు గ్రామ పంచాయతీల్లో లాంచనంగా ప్రారంభించనున్నారు. డిజిటల్ లాకర్, ఈ-విద్య, ఈ-వైద్యం, వాణిజ్యం, పరిపాలన వంటి తదితర సేవలన్నీ ఇకపై ఆన్‌లైన్లో అందిలే చర్యలు. మొత్తం లక్షా 13 వేల కోట్ల పెట్టుబడులతో రెండున్నర లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడమే లక్ష్యం. అవినీతి తగ్గింపు, సాంకేతిక ఫలాలను అందిపుచ్చుకొని భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు డిజిటల్ ఇండియా ప్రాజెక్టు ఉపయుక్తం. ఇక ఈ ప్రారంభోత్సవానికి దిగ్గజ ఐటీ సంస్థల అధిపతులు హాజరుకానున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ