దేశంలో మరోసారి హరిత విప్లవం రావాల్సిన అవసరం ఉందని దేశ ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. జార్ఖండ్‌లో ఆదివారం పర్యటించిన ఆయన హజారిబాగ్ జిల్లాలోని బహ్రీలో ‘ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’’కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దేశంలో వ్యవసాయాభివృద్ధి కోసం అత్యవసరంగా హరిత విప్లవాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. తూర్పు రాష్ర్టాలైన జార్ఖండ్, బీహార్, తూర్పు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, అస్సాం రాష్ర్టాల్లో ఈ పనిని మరింత త్వరగా ప్రారంభించాలని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నించాలన్నారు.