అంకుర భారత్‌ తో అంతా మంచే!

January 16, 2016 | 12:57 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi-starts-start-up-india-niharonline

ప్రధాని నరేంద్రమోదీ ‘అంకుర భారత్‌’ (స్టార్టప్ ఇండియా) పథకాన్ని శనివారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా లక్ష అంకురాలు ఏర్పటయ్యే అవకాశముందని, 50వేల కోట్ల డాలర్ల సంపద సమకూరుతుందని కేంద్రం భావిస్తోంది. అలాగే దీని ద్వారా 35లక్షల మందికి ఉపాధి మార్గాలు లభిస్తాయని భావిస్తున్నారు.

            దేశంలో స్టార్టప్ లను ప్రోత్సహించే దిశగా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ నుండి భారత్ వచ్చిన పెట్టుబడిదారులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. దేశంలో స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి నిపుణుల సలహాలను కోరనున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ