దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి గతి మార్చింది మేమే

November 06, 2015 | 12:16 PM | 1 Views
ప్రింట్ కామెంట్
prime-minister-narendra-modi-inaugurates-delhi-economic-conclave

దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్డీయే అధికారంలోకి వచ్చాకే మరింత బలపడి పుంజుకుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఢిల్లీ ఆర్థిక సదస్సు-2015ను శుక్రవారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జీడీపీ, ఎఫ్ డీఐలలో పెరుగుదల నమోదైందని, ద్రవ్యోల్బణం, సీఏడీలో తగ్గుదల కనిపిస్తోందని తెలిపారు. అయితే ఆదాయం పెరిగిందని, వడ్డీరేట్లు తగ్గాయని, రూపాయి స్థిరంగా ఉందని ఆయన తెలిపారు.

ఇకపై ఆర్థిక సంస్కరణలనేవి స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలం కొనసాగుతాయని స్పష్టం చేశారు. సంస్కరణలతో ప్రత్యేకంగా పేదలకు మేలు జరుగుతుందన్నారు. జామ్ (JAM-జన్ ధన్, ఆధార్, మొబైల్) విజన్ లక్ష్యాన్ని చేరుకున్నామని మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. జన్ ధన్ కింద బ్యాంకుల్లో రూ.26 వేల కోట్లు జమయ్యాయని ఆయన వెల్లడించారు. 17 నెలల తమ పాలనలో 190 మిలియన్ల మందిని బ్యాంకింగ్ రంగానికి పరిచయం చేశామని చెప్పుకొచ్చారు. 2010 తర్వాత ఢిల్లీ ఆర్థిక సదస్సులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ యే కావటం విశేషం. దేశ ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన పలు అంశాలను ఈ సదస్సులో ఆర్థికవేత్తలు, మేధావులు చర్చిస్తారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ