నేపాల్ తో సహా ఉత్తర భారతదేశాన్ని మంగళవారం మరోసారి భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. అయితే గతసారి లాగానే ఈసారి కూడా ఈ ప్రకృతి విపత్తును మన ప్రధాని మోదీయే ముందు పసిగట్టారట. అంతేకాదు వెంటనే అప్రమత్తమయ్యి అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటుచేశారుట. తక్షణమే సహాయ, పునరావాస చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు ఈ విషయాన్ని ట్విట్టర్లో కూడా ఆయన షేర్ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చాడు. ఢిల్లీలో పెద్ద ఎత్తున భూమి కంపించిందని, అపార నష్టం సంభవించే అవకాశాలున్నాయని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇఫ్పటిదాకా 19 మంది నేపాల్ లో చనిపోగా, 981 మంది గాయపడ్డారని ఆ దేశ హోంశాఖ ప్రకటించింది. ఇక భారత్ లో ఒక్క బీహార్ లోనే 15 మంది చనిపోయారని, యూపీలో మరో ఇద్దరు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మరణాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.