బరాక్ ఒబామాకి సర్ ప్రైజ్ గిఫ్ట్

September 25, 2015 | 02:26 PM | 3 Views
ప్రింట్ కామెంట్
modi-surprise-gift-to-obama-signed-indian-flag-niharonline

కలలో కూడా ఊహించలేని బహుమతి అగ్రరాజ్యం అధ్యక్షుడికి దక్కనుంది. అదీ మన దేశం నుంచే కావటం విశేషం. దేశ ప్రధాని మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు కదా. ఆయన బరాక్ ఒబామాకు ఓ అరుదైన కానుకను ఇవ్వబోతున్నారు. ఏంటనుకుంటున్నారా? వచ్చే సోమవారం ఒబామాను మోదీ కలవనున్నారు. ఈ సందర్భంగా మోదీ ఆటోగ్రాఫ్ చేసిన భారత జాతీయ పతాకాన్ని ఒబామాకి ఇవ్వనున్నారు. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా చేతుల మీదుగా దాన్ని అందజేయనున్నారు. అమెరికాలోని 40 మంది టాప్ ఎగ్జిక్యూటివ్స్ కి ప్రధాని విందు ఇచ్చారు. ఆ విందులో పలు అరుదైన వంటకాలను వికాస్ ఖన్నా ఆధ్వర్యంలో తయారుచేశారు. ఇదిలా ఉండగా జాతీయ జెండాపై మోదీ సంతకం చేయడం పతాక గౌరవానికి సంబంధించిన నియమాల ఉల్లంఘన కిందికి వస్తుందా అనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చజరుగుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ