ప్రధాని తెలంగాణ పర్యటన ఖరారు?

February 10, 2016 | 12:22 PM | 3 Views
ప్రింట్ కామెంట్
PM-narendra-modi-telangana-tour-niharonline

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా రామగుండంలో థర్మల్ పవర్‌ప్లాంట్‌కు, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని సమాచారం. నాలుగువేల మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేస్తున్న థర్మల్ పవర్‌ప్లాంట్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని అధికారి ఒకరు తెలిపారు. కర్మాగారం పునరుద్ధరణతో తెలంగాణలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

                         అధికారంలోకి వచ్చాక మోదీ తొలి అధికారిక తెలంగాణ పర్యటన ఇదే అవుతుంది. ప్రధాని పర్యటన అఫీషియల్ గా ఖరారు కానప్పటికీ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో మాత్రం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. వరంగల్ లోని గిరిజన వర్సిటీ.. కాళోజీ హెల్త్ వర్సిటీ.. టెక్స్ టైల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. తద్వారా 21 నెలల కాలంలో తెలంగాణలో పర్యటించలేదన్న మచ్చను తొలగిపోతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ