జర్మనీ ఇన్వెస్టర్లకు మోదీ సుదీర్ఘ వివరణ

April 13, 2015 | 11:34 AM | 58 Views
ప్రింట్ కామెంట్
pm_modi_germany_niharonline

భారత్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై జర్మనీ పారిశ్రామిక దిగ్గజాలకు భారత ప్రధాని మోదీ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇండియాలో మార్పు రావాల్సిన 80 అంశాలను ప్రస్తావించి, అందుకు సహకరించాలని కోరారు. డైమ్లర్, మెట్రో ఏజీ, బొంబార్డియర్, వోయిత్ తదితర 14 సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో మోదీ సమావేశం అయ్యారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని అభ్యర్థించిన ఆయన ఇక్కడి అవకాశాల గురించి సవివరంగా తెలిపారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి పెట్టుబడులు రాక విషయమై తానే స్వయంగా సమీక్షలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. విదేశీ పెట్టుబడి నిబంధనలకు సవరించమని, ఇకపై మరింత సులువుగా ఇన్వెస్ట్ చేయొచ్చని ఆయన హామీ ఇచ్చారు. భూసేకరణలో ఇబ్బందులు అధిగమించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్నామని , దీనివల్ల పరిశ్రమలకు అవసరమయ్యే భూమి సమస్య కాబోదని ఆయన వారితో చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ