భద్రతా పథకాలపై దృష్టిసారించిన ప్రధాని

May 04, 2015 | 10:50 AM | 127 Views
ప్రింట్ కామెంట్
pm_narendra_modi_focus_on_welfare_schemes_niharonline

దేశ ప్రధాని మోదీ విమర్శలకు చేతల ద్వారానే సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారు. రైతుల ఆత్మహాత్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నా సరే తన కార్యచరణ ను ముందుకు సాగించాలనే ఉద్దేశ్యంతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పలు సామాజిక భద్రతా పథకాలు ఈ నెలలో ఆరంభించనున్నట్లు సమాచారం. కీలకమైన ‘‘నెలకు రూపాయి ప్రీమియంతో రూ.2 లక్షల ప్రమాద బీమా’’ తోపాటు పలు సామాజిక భద్రతా పథకాలను 8వ తేదీన ప్రధాని మోదీ కోల్‌కతాలో ప్రారంభిస్తారని కేంద్రం చెబుతోంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ అధికారిక ప్రకటన జారీచేసింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్‌బీవై), ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబీవై) పథకాలు ప్రమాద బీమా కల్పిస్తుండగా.. అటల్‌ పెన్షన్‌ యోజన(ఏపీవై) వృద్ధుల భద్రతకు ఉద్దేశించిన పథకం. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఫిబ్రవరి 28న బడ్జెట్‌ ప్రసంగంలో చదివి వినిపించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ