నేపాల్ ప్రధాని కంటే మోదీనే అలర్ట్ గా ఉన్నారే!

April 30, 2015 | 02:27 PM | 129 Views
ప్రింట్ కామెంట్
narendra_modi_first_knows_about_nepal_earthquake_niharonline

నేపాల్ ను అతలాకుతలం చేసిన భారీ భూకంపం గురించి ప్రపంచానికి సమాచారం తెలిసిన కొన్ని గంటల తర్వాతే ఆ దేశ ప్రధానికి సమాచారం అందిందట. ఉదయం 11:40 గంటల సమయంలో తొలిప్రకంపనలు రాగా, ఆపై పది నిమిషాల వ్యవధిలోనే మీడియా సంస్థలు ఫ్లాష్ న్యూస్ వేశాయి. ఆ సమయంలో కోయిరాలా థాయ్ లాండ్ లో అధికారిక పర్యటనలో ఉన్నారు. విచిత్రమేంటంటే ప్రమాదంపై భారత ప్రధాని మోదీ ట్వీట్ చేసిన తర్వాతనే నేపాల్ ప్రధానికి విషయం తెలిసిందట. ఇదే విషయాన్ని కోయిరాలా తనతో చెప్పినట్లు మోదీ వివరించారు. పార్లమెంట్ లో పనితీరుపై జర్నలిస్ట్ లకు శిక్షణ ఇస్తున్న సమయంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. అంతేకాదు గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా జరిగిన ఓ రైలు ప్రమాద విషయం గురించి కూడా ఆయన ఉదాహరించాడు. అంతేకాదు పాత్రికేయులకు ప్రజెంట్ చేయడానికి సరైన వార్తలేవీ దొరకట్లేదని చతురులు కూడా వేశారాయన.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ