ఆ అమ్మాయికి మోదీ లేఖ రాశారు

March 01, 2016 | 05:02 PM | 2 Views
ప్రింట్ కామెంట్
narendra-modi-jahnavi-behal-niharonline

పదవతరగతి చదువుతున్న ఓ అమ్మాయి రాసిన లేఖలు ప్రధాని నరేంద్ర మోదీని కదిలించాయి. వాటికి స్పందించి చర్యలు తీసుకోవటమే కాదు, ఏకంగా ఆమెకు రిప్లై కూడా పంపాడు. ఆ అమ్మాయి పేరు జాహ్నవి బెహల్,. లూథియానాలో నివాసం. ఈమె 2010 నుంచి.. శిశు మరణాల మీద పోరాడుతోంది. గతేడాది స్వఛ్ భారత్‌లో కూడా యాక్టివ్ మెంబర్. అక్కడితో ఆగిపోలేదు. 2014లో పొగాకు, లిక్కర్‌ని చిన్న పిల్లలకు దొంగతనంగా అమ్ముతున్నారని తెలుసుకుంది. వారి మీద నిఘా పెట్టి పట్టుకుంది. దూరదర్శన్‌లో ద యూత్ ఆఫ్ ఇండియా అగనెస్ట్ డ్రగ్స్ పేరుతో ప్రసారమయ్యే ప్రొగ్రాంలో కూడా పాల్గొంటుంది. ఎక్కడ ఏం అన్యాయం జరిగినా మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్‌లకి కూడా లెటర్‌లు రాస్తుందీ అమ్మాయి.

ఇప్పటికే మోదీకి ఐదు లెటర్లు అందాయి. అవి చదివినా ఆయన వాటి మీద యాక్షన్ తీసుకోవడమే కాదు.. జాహ్నవికి వివేకానంద కొటేషన్ ఒకటి రాసి, కింద ఆయన సంతకం పెట్టి పంపించారు. అంతేనా, ఆమె చేసే కృషికి మెచ్చుకోలుగా ఓ పెద్ద లెటర్ రాసి పంపించాడు.

మదర్‌థెరిస్సా నాకు ఆదర్శం. మన దేశానికి సేవ చేయడమే నా ముందున్న లక్ష్యం. నేను శిశు మరణాల మీద ఒక డాక్యుమెంటరీ కూడా తీశాను అంటోంది జాహ్నవి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ