గత వారం రోజులుగా లలిత్ మోదీ అనే పేరు రాజకీయాల్లో ఎవరికీ నిద్ర లేకుండా చేస్తోంది. తన వీసా వ్యవహారానికి సంబంధించి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నుంచి మొదలుకుని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, యూపీఏ హయాంలోని మాజీ మంత్రులు ఆఖరికి బ్రిటన్ రాణి పేరుకూడా లాగేశాడు. ఈ ఐపీఎల్ మాజీ కమిషనర్ దాటికి దేశంలోని కీలక నేతలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ తోసహా మిత్రపక్షాలు విరుచుకుపడుతున్నప్పటికీ ప్రధాని ఈ వ్యవహారంలో మౌనంగా ఉండటం పెద్ద చర్చనీయాంశమైంది. అంతేకాదు ఈ వ్యవహారంతో సంబంధం లేనట్లు యోగా దినోత్సవాన్ని ప్రచారంలో మునిగిపోయారు. ఇక్కడ ఆయన తన చతురతను ప్రదర్శించకనే ప్రదర్శించారేమో అనిపిస్తోంది. కీలక నేతలతో సహా ఎవరీని మాట్లడకుండా ఉండాలని సూచించటం వెనుక అంతర్యం బోధపడుతోంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఎంతో క్లిష్టమైన ఈ వ్యవహారంలో కిక్కురుమనకుండా ఉండటమే త్వరగా వీగిపోవటానికి మంత్రమని ఆయన గ్రహించారు. అంతేకాదు తన సహచరులతోపాటు ఇందులో ఇరుకున్నవారికి కూడా సూచనలిస్తున్నారు. మోదీ మంత్రం బాగానే పనిచేస్తోంది కదా.