కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 45వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహూల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఆయనకు దీర్ఘాయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నా’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై రాహుల్ గాంధీ ట్విట్టర్లో స్పందించారు. ‘‘మీ అభినందనలకు నా కృతజ్నతలు’’ అని పోస్టింగ్ ను ఉంచారు. కాగా, చాలా సంవత్సరాల తర్వాత రాహుల్ తన జన్మదినాన్ని ఢిల్లీలో జరుపుకుంటూ ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చాయి. తన నివాసంలో 45 కిలోల భారీ కేకును కాంగ్రెస్ నేతల, కార్యకర్తల సమక్షంలో రాహుల్ కట్ చేశారు.