ఆ సమయంలో నా కళ్ల ముందు ప్రజలే కనిపిస్తారు

May 26, 2015 | 10:58 AM | 26 Views
ప్రింట్ కామెంట్
narendra_modi_one_year_ruling_niharonline

ప్రధాని కుర్చీలో కూర్చుని ఏడాది పూర్తయ్యింది. మరీ ఈ ఏడాదిలో ఆయన చేసిందేంటీ? ఈ ప్రశ్నలకు స్వయంగా మోదీయే స్పందించారు. ఏకంగా ఆయన చేపట్టిన పథకాల గురించి, సాధించిన విజయాల గురించి వివరించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్రజల నుద్దేశించి ఆయన ప్రసంగం ప్రచురించారు.

‘‘నా ప్రియమైన దేశ ప్రజలారా... కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో నా కళ్ల ముందు పేద ప్రజలు, రైతులు, కార్మికులు కనిపిస్తారు. అందుకే వారిని దృష్టిలో పెట్టుకునే నా నిర్ణయాలు ఉంటాయి. గత ప్రభుత్వ హాయాంలో జరిగిన కుంభకోణాల ప్రభావాన్ని జనాల మీద పడకుండా ఆ సోమ్మును రికవరీ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాల ద్వారా యువతకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలను దగ్గర చేశామని పేర్కొన్నారు. మహిళలు బహిర్భూమికి వెళ్లకుండా చూడటమే స్వచ్ఛ భారత్ లక్ష్యమని తెలిపారు. ఆడపిల్లలను రక్షించండి, చదివించండి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు. గంగా నది శుద్ధి కోసం నమామి గంగ ప్రారంభించామని, ప్రతి గ్రామాన్నీ డిజిటల్ కనెక్టివిటీ లో భాగం చేస్తామని అన్నారు. దేశం ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ప్రజలు కలిసి రావాలని కోరిన ఆయన, ‘‘మీ సేవకే అంకింతం... జైహింద్ అంటూ ముగించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ