తేల్చలేదు... కానీ, నాన్చరట

May 23, 2015 | 04:46 PM | 26 Views
ప్రింట్ కామెంట్
Modi_and_Sonia_cic_cvc_niharonline

కీలకమైన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మరియు విజిలెన్స్ కమిషన్ పోస్టుల భర్తీ కోసం శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అధికారులతో కీలకభేటీ అయ్యారు. అయితే సుమారు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. సమావేశం అనంతరం ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ... అవసరమైన తుది జాబితాను సిద్ధం చేయాలని ఇప్పుడు నిర్ణయించినట్లు, చివరి సమావేశం జూన్ మొదటి వారంలో ఉండనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ కూడా హాజరయ్యారు. కీలకమైన పదవుల నియమకానికి కేంద్ర ప్రభుత్వం ఆలసత్వం ప్రదర్శిస్తుందంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శలు చేసిన నేపథ్యంలో త్వరలోనే వాటి భర్తీ ఉంటుందని మోదీయే స్వయంగా పార్లమెంటులో ప్రకటించాడు. అన్నట్లుగానే కొద్దిరోజులకే ఈ అంశంపై సమావేశం నిర్వహించటం విశేషం. కాగా, కేంద్ర సమాచారం కమిషనర్ పదవి గత ఆగష్టు నుంచి విజిలెన్స్ కమిషనర్ పదవి సెప్టెంబర్ నుంచి ఖాళీగా ఉన్నాయి. స్వయానా సోనియాగాంధీనే ఈ అంశంపై మాట్లాడటంతో నాన్చకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మోదీ భావిస్తున్నారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ