బృహత్తర కార్యం కోసం ప్రధాని కార్యాచరణ?

April 21, 2015 | 11:48 AM | 42 Views
ప్రింట్ కామెంట్
modi_eye_on_2024_olympics_niharonline

దేశ ప్రధాని మోదీ మరో బృహత్తర కార్యం కోసం కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. 2024 ఒలంపిక్ గేమ్స్ నిర్వహణకే ప్రధాని మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం గుజరాత్ ను వేదిక చేసుకుని బిడ్ వేయడానికి ఆసక్తిచూపుతుందన్న వార్తలు వినవస్తున్నాయి. త్వరలో ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ ఇండియాకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్వయంగా ఈ వ్యవహారంలోకి దిగనున్నాడు. బాచ్ తో 27 న సమావేశం జరగనుంది. ఇక్కడే మోదీ ఒలంపిక్స్ నిర్వహణ కోసం బాచ్ తో చర్చించనున్నాడు. ఇక స్వయంగా మోదీ యే రంగంలోకి దిగాడు కాబట్టి గుజరాత్ కే ఆ మహాత్కర అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పోటీల్లో అమెరికా, ఇటలీ లాంటి పెద్ద పెద్ద దేశాలు బిడ్ వేయనున్నాయి. మరి వీటన్నింటి నుంచి పోటీ తట్టుకుని నిర్వహాణను భారత్ చేజిక్కిచ్చుకుంటుందా? మోదీ మేనియా ఆ దిశగా పనికొస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే...!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ