సరికొత్త డిజిటల్ అవతారంలో మోదీ

June 18, 2015 | 02:51 PM | 1 Views
ప్రింట్ కామెంట్
PM_narendra_modi_app_niharonline

ప్రజలకు చేరువయ్యేందుకు మార్గాలను ఎంచుకోవటంలో దేశ ప్రధానిని మించినోళ్లు ఎవరూ లేరని అనిపిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న ఆయన తాజాగా తన మరో యత్నాన్ని ప్రారంభించారు. తన పేరుతో తయారు చేసిన ఓ మొబైల్ యాప్ ను స్వయంగా ఆయనే విడుదల చేశారు. నరేంద్ర మోదీ యాప్ ను ప్రారంభించాను. రండి... మొబైల్ లో నాతో కనెక్ట్ అవ్వండి అని మోదీ ట్వీట్ చేశారు. తన పేరుపై వచ్చిన మొబైల్ యాప్ లో పలు సరికొత్త ఫీచర్లు ఉన్నాయని, ఆ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చునని మోదీ తెలిపారు. ట్విట్టర్ లో ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే ఆయన తాజాగా మొబైల్ యాప్ తో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా సమచారంతోపాటు ఆయన నుంచి సందేశాలు, ఈ మెయిల్స్ కూడా అందుతాయి. అంతేకాదు ఈ యాప్ ద్వారా ఆయనతో ఆలోచనలను పంచుకోవటమే కాదు, సలహాలు, సూచనలు కూడా ఇచ్చే అవకాశం ఉంది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ