మోదీ పుతిన్ ఇచ్చి పుచ్చుకున్నారు

December 24, 2015 | 12:45 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Modi_Putin_gandhi_hand_written_page_niharonline

వరుస విదేశీ టూర్లలో బిజీగా ఉంటున్న మన ప్రధాని నరేంద్ర మోదీ ఆయా పర్యటనల్లో అక్కడి ప్రజల మన్ననలు అందుకోవటం మనం చూస్తున్నాం. అదే సమయంలో దేశాధ్యక్షుల నుంచి అరుదైన కానుకలను ఆయన అందుకుంటూ వస్తున్నారు. తాజాగా  రష్యా పర్యటనలో ఉన్న మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విలువైన, అరుదైన కానుక ఇచ్చారు.

మాస్కోలో వారిద్దరూ భేటీ అయిన సమయంలో మహాత్మాగాంధీ స్వహస్తాలతో రాసుకున్న డైరీలోని ఓ పేజీని తనకు బహుమతిగా ఇచ్చినట్టు మోదీ ట్విట్టర్ లో తెలిపారు. ఆ బహుమతి సమర్పించినందుకు గాను పుతిన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అదే సమయంలో పుతిన్ కు భారత్ తరపున 18వ శతాబ్దానికి చెందిన బెంగాల్ కత్తిని ప్రదానం చేసినట్లు మోదీ తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ