భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన తాజాగా టర్కీలోని అంతల్యాలో జరిగిన జీ20 దేశాల సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీకి గౌరవ సూచకంగా ఆ దేశం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. 2.80 టర్కీష్ లీరాల( భారత కరెన్సీ ప్రకారం 65 రూపాయలు) విలువచేసే స్టాంప్‌ను విడుదల చేసింది. నరేంద్రమోదీ-భారత ఘనతంత్య్ర దేశ ప్రధానమంత్రి అని కింద ముద్రించింది. జీ20 సదస్సుకు హాజరైన దేశాధినేతల పేరుతో స్టాంపులను విడుదల చేసినట్టు టర్కిష్ అధికార ట్విట్టర్‌లో పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు బరాక్‌ఒబామా, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ తదితర దేశాధినేతల స్టాంపులను కూడా విడుదల చేసింది. మొత్తం 33 రకాల స్టాంపులలో 19 దేశాల అధినేతల ఫోటోలతో అవి ఉండటం విశేషం.