పోప్, షింజో తర్వాత మోదీ

April 29, 2016 | 08:17 PM | 1 Views
ప్రింట్ కామెంట్
pmmodi-to-adress-us-congress-niharonline

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాటలు వినాలని అమెరికా ప్రతినిథుల సభలో సీనియర్ నేతలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మోదీ అమెరికాలో జూన్‌లో పర్యటిస్తారు. కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా ప్రతినిథుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ కోరింది. అమెరికా, భారతదేశం మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని, రక్షణ, మానవీయ, విపత్తు సహాయక, అంతరిక్ష సహకారం, తదితర రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని,

                                        ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాటలను నేరుగా వినడానికి ఇదే సరైన సమయమని చెప్తూ హౌస్ స్పీకర్‌ పాల్ రియాన్‌కు రిపబ్లికన్ కమిటీ చైర్మన్ ఎడ్ రాయ్స్, ప్యానెల్ ర్యాంకింగ్ డెమొక్రాట్ ఇలియట్ ఎంగెల్ లేఖ రాశారు. దీనికి స్పందించిన  స్పీకర్ రియాన్ ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా రాశారు. అమెరికా సెనేట్, ప్రతినిథుల సభలను ఉద్దేశించి ప్రసంగించాలని ఆహ్వానం అందడం గొప్ప గౌరవంగా పరిగణిస్తారు. గత ఏడాది ఇటువంటి గౌరవం దక్కించుకున్నవారు ఇద్దరే ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ సెప్టెంబరు 24న, జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే ఏప్రిల్ 29న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ