ఆ విషయంలో మనం ఎవరిపై ఆధారపడొద్దు

January 04, 2016 | 12:36 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Weapons-manufacture-backbone-Make-in-India-programme

అన్ని దేశాలు యుద్ధాల కోసం అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్న తరుణంలో అంత సాంకేతిక పరిజ్ఞానం ఇంకా భారత్ దరిచేరలేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తలపెట్టిన కొత్త హెలికాప్టర్ యూనిట్ కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ శంకుస్థాపనతో తన 'మేకిన్ ఇండియా' కలలో కొంత భాగం తీరిందని అన్నారు. పూర్తి అప్ డేటెడ్ టెక్నాలజీ ఆధారిత ఆయుధాలు భారత అమ్ముల పొదిలోకి ఇంకా రాలేదని అన్నారు. భవిష్యత్ అవసరాలు తీర్చేలా భారత సైంటిస్టులు కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం ప్రారంభించిన ఈ కేంద్రం భవిష్యత్తులో భారత రక్షణ అవసరాలకు తగ్గట్టుగా ఆయుధ సంపత్తిని పెంచేందుకు సహకరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.

                                   "భద్రత విషయంలో ఎవరిపైనా ఆధారపడకూడదని భావిస్తే, మన ఆయుధాలు, రక్షణ సామాగ్రిని మనమే తయారు చేసుకోవాలి" అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఒకవేళ విదేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేయాల్సి వస్తే, ఆ సంస్థలను ఇక్కడికే వచ్చి వాటిని తయారు చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఈ హెలికాప్టర్ తయారీ కేంద్రం నుంచి 2018లో ఫస్ట్ చాపర్ బయటకు వస్తుందని, సైనికులకు మందులు, యుద్ధం జరిగే ప్రాంతాలకు సహాయ సామాగ్రిని తరలించేందుకు వీటిని వాడనున్నామని తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ