జమ్ములో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక దేశ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా శనివారం అక్కడ పర్యటించనున్నారు. రాజధాని శ్రీనగర్ లో ర్యాలీతో ఆయన పర్యటనను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. చంద్రకోట్‌లో బాలీఘర్ జల విద్యుత్తు కేంద్రం రెండో దశను ప్రారంభిస్తారు. దాని తర్వాత ఉధంపూర్-రాంబన్, రాంబన్-బానిలాల్ మధ్య నాలుగు లైన్లకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం షేర్-ఈ-కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ స్టేడియం మొత్తానికి తమ ఆధీనంలోకి తీసుకుంది. సమీప ప్రాంతాల్లో ప్రత్యేక దళాలు గస్తీ నిర్వహిస్తున్నారు. స్టేడియంలో సీసీటీవీలను అమర్చారు. ప్రత్యేక భద్రతా దళాలను జాతీయ రహదారిపై మోహరించారు. కాగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా, మధ్యాహ్నం 2 గంటల వరకూ మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇక ముందస్తు జాగ్రత్తగా వేర్పాటువాద నేతలను గృహ నిర్భంధం చేశారు. సయిద్ అలీ షా గిలానీ, మీర్వాజ్ ఉమర్ ఫారుక్ లాంటి నేతలను ముందే నిర్బంధించారు. మోదీ ర్యాలీకి కౌంటర్‌గా వేర్పాటువాద సంఘాలు మరో ర్యాలీ నిర్వహించనున్నాయి. టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ గ్రౌండ్‌లో వేర్పాటువాదుల ర్యాలీ జరగనుంది. జమ్ముకశ్మీర్‌లో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్‌ఎఫ్ జవాన్లను అప్రమత్తం చేశారు. అనుమానాస్పద ప్రాంతాల్లో ముందుగానే హైఅలర్ట్