మమతా గుజరాతీ... మోదీ బెంగాలీ!

January 21, 2016 | 12:12 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi-wishes-mamatha-in-bengali-for-new-year-niharonline

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలలే ఉన్న నేపథ్యంలో మమతా బెనర్జీ, మోదీల మధ్య ట్వీట్ల రూపంలో జరిగిన సంభాషణ సర్వత్రా ఆసక్తిని రెకెత్తిస్తోంది. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా ప్రధానికి గుజరాతీ భాషలో ట్వీట్ చేస్తూ, మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలుపగా, అందుకు మోదీ తనదైన శైలిలో లేటుగా స్పందించారు.

            మమతా బెనర్జీ ప్రధానికి 'న్యూ ఇయర్ విషెస్'ను గుజరాతీ భాషలో చెబుతూ ఆ రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించే స్లోగన్ 'పరివర్తన్ నాహీ పటాన్' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మోదీ, "మీ శుభాకాంక్షలు... అది కూడా గుజరాతీ భాషలో... నా హృదయాన్ని తాకాయి. మమతా సోదరికి నా కృతజ్ఞతలు. 2016 ఆమెకు గొప్పగా ఉండాలి" అన్నారు. ప్రధాని ఈ ట్వీట్ చేసిన రెండు గంటల తరువాత మమత మరో ట్వీట్ పెడుతూ, "నేను గుజరాతీ భాషలో పంపిన శుభాకాంక్షలు మీకు నచ్చడం సంతోషం. మీరు నాకు బెంగాలీలో శుభాకాంక్షలు పంపినందుకు నా కృతజ్ఞతలు" అన్నారు. ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే వెల్లడించలేం కానీ, కొత్త సంవత్సరం తేదీని జనవరి 20 కి షిఫ్ట్ చేశారా అంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే మోదీ దీదీ ట్వీట్ ను మరి ఇంత లేటుగా చూశారా అన్నది వారి అనుమానం అంతే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ