బోణీ వెంకన్న కాదు ‘మహా’ వినాయకుడు

December 10, 2015 | 12:28 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Narendra-Modi-gold-scheme-siddhivinayak-temple-40kg-gold-niharonline

గోల్డ్ స్కీంతో దేశంలోని ఇళ్లలో బీరువాల్లో మగ్గి ఉన్న బంగారాన్ని బయటకు తెచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నించారు. దీపావళి కానుకగా ప్రారంభించిన ఈ పథకానికి స్పందన అంతగా రావటం లేదు. చిన్న మొత్తంలో కాకపోయినప్పటికీ పెద్ద మొత్తంలో మాత్రం తప్పక జమ అవుతుందన్నదే మోదీ ఆలోచన.  మొదట్లో తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం వెంకన్న బంగారాన్ని ఈ పథకంలో జమ చేయాలని ఆలోచించింది. ఈ మేరకు త్వరలో వారు ప్రధానిని కలిసి తమ ఆలోచనను ఆయనకు చెప్పాలని కూడా అనుకున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం దీనిపై టీటీడీ పాలక మండలి ఇప్పటిదాకా ఇంకా నిర్ణయమే తీసుకోలేదని తెలుస్తోంది. కానీ, దేశంలోని సంపన్న ఆలయాల్లో ఒకటైన మహారాష్ట్ర సిద్ధివినాయక ఆలయం మాత్రం మోదీ పిలుపుకి స్పందించిందినట్లు తెలుస్తోంది.

                        సిద్ధి వినాయకుడికి చెందిన బంగారు నగలను ప్రధాని గోల్డ్ స్కీం పథకానికి తరలించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుందట. ఆలయంలోని 40 కిలోల బంగారాన్ని ఈ పథకానికి తరలించేందుకు కమిటీ పచ్చజెండా ఊపింది. ఇక ఈ బంగారాన్ని డిపాజిట్ చేయడం ద్వారా సిద్ధివినాయకుడికి ఏటా రూ.69 లక్షల వడ్డీ అందనుంది. సిద్ధివినాయక స్వామి వారి ఆలయం తీసుకున్న ఈ నిర్ణయం తిరుమల, షిరిడీ లతో పాటు మరికొన్ని ఆలయాల పాలక మండళ్లలో కదలిక తేవటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ