మోదీ అంటే ఏంటంటే...?

September 07, 2015 | 03:28 PM | 2 Views
ప్రింట్ కామెంట్
pm-modi-venkaiah-naidu-niharonline.jpg

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని తన వాక్చాతుర్యంతో ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు. ఇప్పటికే నమోగా పాపులర్ అయిన మోదీని మరో కొత్త పేరుతో ఆయన పలుకరించారు. తాజాగా ప్రధాని పేరుకు వెంకయ్య సరికొత్త అర్థం చెప్పారు. మోదీ (MODI) అంటే 'మేకర్ ఆఫ్ డెవలప్ మెంట్ ఇండియా' అని అభివర్ణించారు. బదల్ పూర్- ఫరీదాబాద్ మెట్రో మార్గం ప్రారంభోత్సవం సందర్భంగా వెంకయ్య ఇలా మోదీని పొగిడారు. అటు ప్రధాని కూడా వెంకయ్యను ప్రశంసలతో ముంచెత్తారు. వెంకయ్య నాయకత్వంలో పలు మెట్రో ప్రాజెక్టులు అమలవుతున్నాయన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఆకర్షణీయ నగరాల (స్మార్ట్ సిటీలు) పథకానికి రూపునిచ్చి ప్రారంభించినట్టు తెలిపారు. ఆకర్షణీయ నగరాలతో ఆర్థిక పురోగతి మరింత విస్తృతమవుతుందని పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ