రాయుడూ... బాగా ఆడాలి, ధోనీ... నీపై నమ్మకముంది

February 13, 2015 | 12:07 PM | 70 Views
ప్రింట్ కామెంట్
modi_wishes_teamindia_niharonline

శనివారం నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశ ప్రధాని మోదీ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆటగాళ్లను పేరుపేరునా ఉద్దేశించి ట్విట్టర్లో ట్వీట్లు చేశారు. ముఖ్యంగా తెలుగు తేజం అంబటి రాయుడిని ప్రోత్సహిస్తూ... రాయుడూ.. బాగా ఆడాలి. గెలుపులో కీలకపాత్ర పోషిస్తావన్న నమ్మకం ఉంది అని పేర్కొన్నారు. ఇక సారథి మహేంద్ర సింగ్ ధోనీపైనా ప్రధాని నమ్మకం వ్యక్తంచేశారు. ధోనీ నీ గురించి బాగా తెలుసు. నువ్వు సాధించగలవు. దేశం గర్వపడేలా చేయాలి అని ట్వీట్ చేశారు. ఇక స్టార్ బ్యాట్స్ మెన్ కోహ్లీ పై దేశం ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు. రహానే ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నువ్వు తీసే వికెట్లు ఎంత త్వరగా మ్యాచ్ గెలుస్తామన్న దానిని నిర్ణయిస్తాయి అంటూ యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. బాగా ఆడి వికెట్లు తీయాలంటూ బెంగాల్ యువకెరటం మహ్మద్ షమీకి సూచించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ