మరో మెగా సమస్యపై మోదీ పోరాటం

August 27, 2015 | 04:42 PM | 3 Views
ప్రింట్ కామెంట్
modi_mission_indradanush_on_polio_niharonline.jpg

దేశంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా మరో మెగా సమస్యపై దృష్టిసారించారు. గ్రామాల దత్తత, పేదలకు బ్యాంకింగ్ సేవలు, మేకింగ్ ఇండియా, స్వచ్ఛ్ భారత్ ఇలా ఆయన టచ్ చేసినవన్నీ బృహత్ పథకాలే. ఇక ఇప్పుడు మరో పథకం ఆయన ఆలోచనల్లో మెదిలి ఆచరణలోకి రాబోతుంది. అదే ‘మిషన్ ఇంద్ర ధనుష్’. దీనికి సంబంధించిన ప్రకటన ఆయన ఈ రోజు ఢిల్లీలో చేశారు. రానున్న కాలంలో భారత్‌ను పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాన నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురువారం గ్లోబల్ కాల్ టు యాక్షన్ సమ్మిట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 24 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. శిశు మరణాల సంఖ్యను తగ్గించే దిశగా వైద్యనిపుణులు కృషిచేయాలని కోరారు. మొత్తానికి మరో మెగా సమస్య పరిష్కారానికి మోదీ చేస్తున్న కృషి హర్షించదగ్గ విషయం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ