వారి మనోధైర్యానికి వందనాలు

April 27, 2015 | 02:23 PM | 54 Views
ప్రింట్ కామెంట్
modi_salutes_to_nepal_people_for_their_tough_condition_niharonline

ప్రకృతి భీభత్సం, ఎడతెరపని విధ్వంసం. వెరసి తీవ్ర భూకంపం నేపాల్ ను నేలమట్టం చేసింది. దేశాన్ని శవాల దిబ్బగా మార్చిపడేసింది. ఎక్కడ చూసిన మృతదేహాలు కుప్పలు తెప్పలుగా పడిఉన్నాయి. అయిన వాళ్లను కోల్పోయి అనాథలుగా మిగిలిన వారేందరో. అయినా మొక్కవోని ధైర్యంతో నేపాల్ ప్రజలు తమ ఆప్తుల కోసం వెతుకులాట సాగిస్తూనే, క్షతగాత్రులకు చేయూతనందిస్తున్నారు. తినడానికి తిండి, పడుకోడానికి గూడు లేకపోయినా, రోడ్లపైనే నివసిస్తున్నారు. అలాంటి వారి ధైర్యాన్ని చూసి భారత ప్రధాని నరేంద్ర మోదీ వారికి మరింత ధైర్యాన్ని నూరిపోసే పనిలో పడ్డారు. ‘‘నేపాలీల మొక్కవోని ధైర్యానికి సెల్యూట్’’ అంటూ ఆయన కొద్దిసేపటి క్రితం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. నేపాల్ లో సాధారణ స్థాయికి వచ్చేదాకా భారత్ సాయం అందిస్తుందని ఆయన ప్రకటించారు. అలాగే భారత్ తరపున అక్కడ రక్షణ చర్యల్లో పాల్గొంటున్న సైనిక బలగాలకు, ఎన్డీఆర్ ఎఫ్ దళాలకు ఆయన కృతజ్ణతలు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ