ఉబ్జెకిస్థాన్ అటు నుంచి అటు ఐదు దేశాలు...

July 06, 2015 | 03:51 PM | 4 Views
ప్రింట్ కామెంట్
modi_leaving_for_russia_tour_niharonline

రష్యాతో సహా ఆరు దేశాల పర్యటన కోసం దేశ ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఆయన ముందుగా ఉబ్జెకిస్థాన్ బయలుదేరి వెళ్తారు. అక్కడ పర్యటన ముగించుకున్న తర్వాత అటు నుంచి ఆయన కజకిస్థాన్, ఆ తర్వాత రష్యా బయలుదేరుతారు. ముఖ్యంగా రష్యా పర్యటన అన్నింటిలో ఇదే కీలకం కానుంది. ఇరు దేశాల సంబంధాల పటిష్టతకు సంబంధించి నరేంద్ర మోదీ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. బ్రిక్స్ సమావేశాల్లోనూ మోదీ పాల్గొంటారు. అనంతరం తుర్కుమెనిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్ దేశాల్లోనూ పర్యటిస్తారు. నేటి నుంచి 12 దాకా ఆయన పర్యటన కొనసాగి 13 న తిరిగి స్వదేశానికి బయలుదేరుతారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ